రాజీవ్ యువ వికాస పథకాన్ని  సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో భాస్కర శర్మ

నవతెలంగాణ -దుబ్బాక 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాస పథకాన్ని’ దుబ్బాక మండలంలోని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో వీ.భాస్కర శర్మ అన్నారు.గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తుదారుల ఫారాలను ఆయన పరిశీలించారు.దరఖాస్తుదారులతో మాట్లాడి ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ లో సంప్రదించాలన్నారు.ఈనెల 14 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమలో ఎంపీఓ నరేందర్ రెడ్డి,బాసిత్, నరేష్,తదితరులున్నారు.
Spread the love