పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

– జిల్లా ప్రభారీ ఆఫీసర్ దీక్షిత్ 

నవ తెలంగాణ –  మల్హర్ రావు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జిల్లా ప్రభారీ ఆఫీసర్ దీక్షిత్ అన్నారు. మండలం లోని కొయ్యుర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యం లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి, చేయూత పథకం, మై భాగో స్త్రీ శక్తి పథకం, ఆయుష్మాన్ భారత్, ఆటల్ పెన్షన్ యోజన లాంటి అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా ప్రజలకు ప్రయోజనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ పథకాలపై అవగాహన కల్పించడానికి గ్రామాల్లో ప్రొజెక్టర్లను ఏర్పాటు చేసి, ప్రభుత్వం చేపట్టే పథకాలు, సౌకర్యాలను వివరిస్తున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్తో పంట పొలాలకు పురుగు మందుల పిచికారీ, బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. పోస్టల్ శాఖ, వైద్య సదుపాయాలు, విద్యపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ మల్హర్ రావు,ఎంపీడీఓ నరసింహ మూర్తి,తహశీల్దార్ శ్రీనివాస్,ఎంపిఓ విక్రమ్ కుమార్,సర్పంచ్ లింగమూర్తి, ఉప సర్పంచ్ మమత, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మిత్ర టీం లీడర్ అనీల్, ఐకేపీ ఏపీఎం కమల,కార్యదర్శి ప్రసాద్,వైద్యం, పోస్టల్ గ్రూపు సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love