Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా చర్చలపై ఇరాన్-యూఎస్ మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. రేపు దోహాలో టెహ్రాన్‌తో చర్చలు జరుగుతాయని చెప్పారు. తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.’ఇరాన్ ఒక సమావేశాన్ని అభ్యర్థించింది. అది రేపు దోహాలో జరుగుతుంది’ అని మాత్రమే ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం, వ్యూహాత్మక జలమార్గం హోర్ముజ్ జలసంధి గుండా జరిగే సముద్ర రవాణాపై నియంత్రణ కోసం ఇరుపక్షాలు కొత్తగా దాడులు చేసుకున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఖతార్‌లో ఈ సమావేశం జరగనుందని వెల్లడించాయి. రేపు (మంగళవారం) జరగనున్న సమావేశాన్ని అమెరికా అధికారులు కూడా ధృవీకరించారు.

అయితే, సాంకేతిక చర్చలు తక్షణమే ప్రారంభం కానున్నాయని సూచిస్తున్న నివేదికలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) ప్రకారం, పశ్చిమాసియాలో సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో కుదిరిన 14-సూత్రాల అవగాహన ఒప్పందం (Memorandum of Understanding) పరిధిలో ఈ వారం ఎలాంటి సాంకేతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు షెడ్యూల్ చేయలేదని ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -