మత్స్యకారుడి ప్రేమకథతో తండేల్‌

మత్స్యకారుడి ప్రేమకథతో తండేల్‌అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘తండేల్‌’ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్ర సారాంశాన్ని ఆవిష్కరించేలా వీడియో రూపంలో విజువల్‌ ట్రీట్‌ను అందించారు మేకర్స్‌. జాలరిగా నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. చైతూతోపాటు కొంతమంది జాలర్లను పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, పోలీసులు బంధించి హింసించడం, జైలర్‌ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, హీరో ఇచ్చిన తగిన సమాధానం, రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని పరిచయం చేయడంతో గ్లింప్స్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇది పాకిస్తాన్‌ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుని గురించి, అతని ప్రేమకథ గురించి సినిమా అని గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కర్ణాటకలో శరవేగంగా జరుగుతోంది.

Spread the love