టీడీపీ మండల అధ్యక్షులు హన్నుబాయి కాంగ్రెస్ లో చేరిక

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండల టీడీపీ అధ్యక్షులు ఎండి హన్నుభాయ్ చౌటుప్పల్ మండల పరిషత్ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్ అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు నేడు మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని బుధవారం  కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌటుప్పల్ మండలం మరియు పట్టణం నుండి తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీల నుంచి దాదాపు 200 మంది కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో చేరడం  జరిగింది. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు గౌడ్ పట్టణ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ నాయకులు డాకోజీ లక్ష్మీనారాయణ మోగుదాల రమేష్ గౌడ్ కాసర్ల శ్రీనివాస్ రెడ్డి సిలివేరు నరసింహ తదితర మాజీ ప్రజాప్రతినిధులు చేరిన వారిలో ఉన్నారు.
Spread the love