ఆదర్శంగా నిలిచిన ఆదర్శ పాఠశాల

– రాష్ట్రస్థాయిలో ఏడవ స్థానం నిలిచిన ఆదర్శ పాఠశాల
– ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల లో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం పట్ల ఆదర్శంగా నిలిచిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇంటర్ లో ప్రతిభా కనబరిచిన వివరాలను వెల్లడించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ గ్రూపులో ఎర్ర శ్రావణ్ కుమార్ 470 మార్కులకు 442 మార్కులు పొట్ట కార్ల అర్చన 470 మార్కులకు 440 మార్కులు సాధించాలని బైపిసి గ్రూపులో ఎం సింధు 440 మార్కులకు 336 మార్కులు మరియు జి శ్రావణి 440 మార్కులకు 349 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారని అన్నారు బండి జోష్ణ 500 మార్కులకు 42 మార్కులు సాధించి పూజారి రశ్మిత 500 మార్కులకు 36 మార్కులు సాధించి పోస్టుల్లో ప్రతిభ కనబరిచారు అని అన్నారు. అంతే కాకుండా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులోని జనిగల శ్రావణి వెయ్యి మార్కులకు 980 మార్కులు సాధించిందని మరియు బి సాహితి వెయ్యి మార్కులకు 976 మార్కులు మరియు మార్గ మేఘన వెయ్యి మార్కులకు 972 మార్కులు సాధించారని అన్నారు మరి బైపీసీ ద్వితీయ సంవత్సరంలో కన్నా పూజ 1000 మార్కులకు 928 మార్కులు సాధించిందని, మరియు సింగారపు అక్షయ 1000 మార్కులకు 917 మార్కులు సాధించిందని తెలిపారు. మరియు సీఈసీ గ్రూపులో సృజన కుమార్ వేయి మార్కులకు 794 మార్కులు సాధించారని భూక్య అనిల్, 1000 మార్కులకు 791 మార్కు సాధించారని తెలిపారు. ఆదర్శ పాఠశాల చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఏడవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
Spread the love