కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందింది

– మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

– మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
– ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత
నవతెలంగాణ – నెల్లికుదురు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ చందు గాని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ ఎన్నికల భాగంలో సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయించి తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చెందినందుకు అడుగులు వేసిందని అన్నారు కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను కేటాయించి రైతుల అభివృద్ధి కోసం పెద్దపీట వేసినాడని అన్నారు. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక రైతుకు పెట్టుబడి ఎక్కువ ఇస్తానని చెప్పి ఇంతవరకు అసలు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు. రైతులను రుణాలు తీసుకోండి డిసెంబర్ 9న మాఫీ చేస్తాను అని చెప్పి నేటి వరకు అటు రుణాలు మాఫీ చేయకపోవడం  విచారకరమైన ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం కోసం మాస పూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం కి వచ్చారు. తప్ప రైతుల అభివృద్ధిని పట్టించుకోవడం దాఖలు లేవని అన్నారు ఇటీవల జిల్లా కేంద్రానికి సీఎం వస్తే కనీసం జిల్లా అభివృద్ధి కోసం ఏం కేటాయించకపోవడం దారుణం అని అన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ వస్తే కోట్లాది రూపాయల నిధులు ప్రకటించి విద్యా వైద్య తోపాటు అన్ని రంగాల అభివృద్ధి కోసం ప్రకటించారని అన్నారు. సీఎం నా ప్రాంతానికి వస్తే మా బ్రతుకులు మారతాయని ప్రజలు చూస్తే కనీసం ఏమి కేటాయించకపోవడం ప్రజల్లో ఆందోళన మొదలైందని అన్నారు. గతంలో సీఎం ఎప్పుడు వస్తాడని ప్రజలు ఎదురు చూసేవారని అన్నారు కానీ ఈ సీఎం సుమారు గంట పాటు ప్రజలు లేకపోవడంతో కొంత సమయం తీసుకుని సమావేశానికి హాజరయ్యారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత కు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు. గ్రామాలలో ప్రజలు కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేశామని అంటున్నారని తిరిగి మళ్లీ బి ఆర్ ఎస్ కే పట్టం కడదామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. కావున కార్యకర్తలు కష్టపడి గ్రామాలలో అధిక మెజార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయించాలని కోరినట్లు తెలిపారు.
Spread the love