జన వికాస ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

– జనా వికాస మండల కోఆర్డినేటర్ ఎం. సరిత
నవతెలంగాణ – నెల్లికుదురు
జన వికాస ఆధ్వర్యంలో ఎర్రబెల్లి గూడెం గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జనవికాస మండల కోఆర్డినేటర్ ఎం సరిత తెలిపారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో గురువారం పెరుమాండ్ల కుమారస్వామి జ్ఞాపకార్ధంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎర్రబెల్లి గూడెం గ్రామంలో పెరుమాండ్ల కుమారస్వామి జ్ఞాపకార్ధంగా ఆయన భార్య పెరుమాండ్ల మంజుల కుమారులు పెరుమాండ్ల శ్రీపాల్ గౌడ్ పెరమళ్ళ కర్ణాకర్ సహకారంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా జలదానం గొప్పదని అన్నారు. ఈ ఎండాకాలంలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా ఎండలు కొట్టడంతో బాట పాదాచారాలు నీరు దొరకగా, ఇబ్బంది పడవ దాని ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ చలివేంద్రాన్ని ప్రత్యేక సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడ నీరు ముంచి ఏర్పాట్లు చూసుకుంటారని అన్నారు .ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల మంజుల శ్రీపాల్ గౌడ్ కర్ణాకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గణేష్ కారోబార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love