పాఠశాలలకు సిమ్ కార్డులు పంపిణీ

– మండల నోడల్ ఆఫీసర్ ఏ రాందాస్
నవతెలంగాణ – నెల్లికుదురు 
పాఠశాలలకు సంబంధించిన ఆన్లైన్ పనుల నిర్వహణకై పాఠశాలలకు ప్రభుత్వం సిమ్ కార్డులను పంపిణీ చేసినట్లు మండల నోడల్ ఆఫీసర్ ఏ.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో మంగళవారం జియో 4g పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల నిర్వహణలో భాగంగా విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం,, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యుడైస్ ప్లేస్, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర ఆన్లైన్ పనులను నిర్వహించటానికి 2023 సంవత్సరంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్ లను పంపిణీ చేసింది. సంబంధిత ట్యాబులు పనిచేయటానికి ఇంటర్నెట్ సౌకర్యం కొరకై ప్రస్తుతం ఆ ట్యాబ్ లకు జియో 4 జి పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డులను అందించడం జరిగిందని తెలిపారు. మండలంలోని 14 ప్రాథమికోన్నత,  34 ప్రాథమిక పాఠశాలలకు మొత్తం 48 పాఠశాలలకు సిమ్ కార్డులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉన్నత పాఠశాలలో ఆన్ లైన్ పనుల నిర్వహణకై గతము నుండే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు టాబ్లను సక్రమంగా సద్వినియోగం చేసుకొని పాఠశాల నిర్వహణ ఆన్లైన్ పనులను ఎప్పటికప్పుడు సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, బొమ్మరాతి సాయిలు, లింగారెడ్డి, సురేష్ రెడ్డి, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్, సిఆర్పిలు బైరు కవిత, జంపాల కవిత, ధరావత్ రవి, కంప్యూటర్ ఆపరేటర్ హెచ్ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love