Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిదేశీ విద్యా పర్యటనకు ఉపాధ్యాయులు

విదేశీ విద్యా పర్యటనకు ఉపాధ్యాయులు

- Advertisement -

అక్కడి బోధనా పద్ధతుల అధ్యయనానికి వెళ్లనున్న బృందం
రాష్ట్రవ్యాప్తంగా 190 మంది..జిల్లా నుంచి 8 మందికి అవకాశం
ఫిన్‌లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనాల్లో అధ్యయనం
ఉపాధ్యాయుల ఎంపికకు 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
​నవతెలంగాణ – సిటీ బ్యూరో

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై ఉపాధ్యా యులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇంటర్నే షనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ను చేపట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్‌- అక్టోబర్ నెలల్లో ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం, చైనా దేశాల్లోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శిం చనున్నారు. అక్కడి ఉత్తమ విద్యా బోధనా పద్ధతులను అధ్యయనం చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 190 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయనుండగా.. వీరిలో 76 మంది పురుషులు, 114 మంది మహిళా టీచర్లు ఉంటారు. హైదరాబాద్ జిల్లా నుంచి 8 మందికి అవకాశం కల్పించనున్నారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అర్హులైన ప్రభుత్వ హెచ్‌ఎంలు, ఉపా ధ్యాయుల నుంచి దర ఖాస్తులను స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన మొత్తం 8 స్థానాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురు పురుష, ఐదుగురు మహిళా ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తున్నారు. వీరిని వివిధ కేటగిరీల వారీగా ఎంపిక చేస్తారు. ఇందులో ప్రిన్సిపాల్ – జీహెచ్‌ఎం- తత్సమాన క్యాడర్ (02), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)- పీజీటీ- పీఎస్‌‌హెచ్‌ఎం-తత్సమాన క్యాడర్(03) ఎస్‌జీటీ- టీజీటీ-తత్సమాన క్యాడర్(03) పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

​అర్హత నిబంధనలు ఇలా..
ఈ ఏడాది ఆగస్టు ఒకటి నాటికి 55 ఏండ్ల లోపు వయసు ఉండాలి. అలాగే కనీసం 10 ఏండ్ల మొత్తం బోధనా సర్వీస్ ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠ శాలలో కనీసం 100 మంది విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) ఉండాలి. ఎలాంటి శాఖా పరమైన (డిసిప్లినరీ) లేదా క్రిమినల్ కేసులూ పెండింగ్‌లో ఉండకూడదు. మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనలు కలిగి ఉండాలి.
​నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసమే..
ఈ అధ్యయన యాత్ర ద్వారా ఉపాధ్యాయులు విదేశాల్లోని బోధనా విధానాలు, సబ్జెక్టుల కరికులమ్, తరగతి గదుల నిర్వహణ, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడ నేర్చుకున్న నూతన మెళకువలను ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా వినియోగిస్తారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 7 (శుక్రవారం) సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం తుది ఎంపిక చేయనున్నట్టు హైదరాబాద్‌ ‌డీఈవో ఎస్‌.యాదయ్య తెలిపారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ డీఈవో కార్యాలయంలోని సమగ్ర శిక్షా క్వాలిటీ కో-ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -