– భారత్-54/5, వర్షం అడ్డంకి
– ఆస్ట్రేలియా : 445ఆలౌట్
బ్రిస్బేన్: మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 445పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 54పరుగులు చేసింది. మూడోరోజు ఆటకు పలుమార్లు వర్షం అంతరాయంగా నిలిచింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 51 రన్స్ చేసింది. ఆసీస్ పేస్ అటాక్ ముందు.. భారత బ్యాటర్లు చేతులెల్తేశారు. జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేశారు. అంతకముందు ఆస్ట్రేలియా ఇవాళ ఉదయం 40 రన్స్ జోడించి 445 రన్స్‌కు ఆల్ అవుట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌల్ చేశాడు. 76 రన్స్ ఇచ్చి అతను ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 88 బంతుల్లో 70 రన్స్ చేశాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్.. సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. రెండో సెషన్‌లో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. మళ్లీ ట్రీ బ్రేక్ తర్వాత కేవలం 17 బంతులే ఆడిన తర్వాత వర్షం వచ్చింది. లైట్ కూడా డిమ్‌గా ఉండడంతో.. ఆటను రద్దు చేశారు. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒక్కడే స్థిరంగా ఆడాడు. ఆస్ట్రేలియా పేస్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిగితా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వేగం ముందు భారత బ్యాటర్లు తేలిపోయారు. మేటి బ్యాటర్ కోహ్లీ కూడా ఈజీగా చిక్కేశాడు. భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉన్నది.
వరుణుడు అడ్డంకి…
ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రిస్బేన్‌లో వర్షం పడింది. దీంతో సోమవారం ఉదయం మైదానం చిత్తడిగా మారడంతో తొలి సెషన్ ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్ నైట్‌స్కోర్ 7 వికెట్ల నష్టానికి 405పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 40 పరుగులు జోడించింది. మిచెల్ స్టార్క్ (18), అలెక్స్ కేరీ దూకుడుగా ఆడారు. అయితే బుమ్రా చక్కటి బంతితో స్టార్క్‌ను ఔట్ చేశాడు. మళ్లీ వరుణుడు ఆటంకపరిచాడు. నాథన్ లైయన్(2) ఐదు ఓవర్లపాటు కాచుకున్నాడు. అతడిని సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన కేరీని ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 445పరుగుల వద్ద ముగిసింది. జస్‌ప్రీత్ బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ తీశారు.
బుమ్రా ఖాతాలో రెండు రికార్డులు..
ఆస్ట్రేలియాపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ (17 మ్యాచుల్లో 53 వికెట్లు) ముందున్నాడు. మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ 51 వికెట్లతో ఉన్నాడు. అయితే, బుమ్రా కేవలం 10 టెస్టుల్లోనే 50కు పైగా వికెట్ల మార్క్‌ను దాటాడు. గబ్బా వేదికపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా మారాడు. ఎర్రాపల్లి ప్రసన్న (6/104)ను బుమ్రా అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 78 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు.
స్కోర్‌బోర్డు…
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)మిఛెల్ మార్ష్ (బి)స్టార్క్ 4, కెఎల్ రాహుల్ (బ్యాటింగ్) 33, గిల్ (సి)మిఛెల్ మార్ష్ (బి)స్టార్క్ 1, కోహ్లి (సి)క్యారీ (బి)హేజిల్‌వుడ్ 3, పంత్ (సి)క్యారీ (బి)కమిన్స్ 9, రోహిత్ శర్మ (బ్యాటింగ్) 0, అదనం 1. (17 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 51పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/6, 3/22, 4/44
బౌలింగ్: స్టార్క్ 8-1-25-2, హేజిల్‌వుడ్ 5-2-17-1, కమిన్స్ 2-0-7-1, లియాన్ 1-0-1-0, హెడ్ 1-0-1-0