Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెల్టు షాపులను బంద్ చేయాలని తీగలపల్లి జీపీ ఏకగ్రీవ తీర్మానం 

బెల్టు షాపులను బంద్ చేయాలని తీగలపల్లి జీపీ ఏకగ్రీవ తీర్మానం 

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో బెల్టు షాపులను బంద్ చేయాలని మధ్యం నిషేధించాలని గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ పంచాయతీ కార్యదర్శి నరెందర్ ఉపసర్పంచ్ వార్డు సభ్యులు యువత ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యవత అత్యధికంగా ఉదయం నుంచి రాత్రి వరకు సమయం సందర్భం లేకుండా విచ్చలవిడిగా మధ్యం సేవిస్తూ ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా మద్యానికి బానిసై పూర్తిగా వ్యసనాలకు బానిసైపోతున్నారని తెలిపారు. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు యువత ఏకాభిప్రాయానికి వచ్చి మధ్యం నిషేధించాలని తీర్మానం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -