- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం తాడు బిలోలి గ్రామంలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఐదు ఇండ్లను తహసిల్దార్ శ్రవణ్ కుమార్ పరిశీలించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ తెలంగాణ శంకర్, ఉప సర్పంచ్ కుద్దూస్, మాజీ సర్పంచి రాజేశ్వర్, జిపిఓ అరుణ్, కారోబార్ అనంతరావు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



