ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం

నవతెలంగాణ – రాయపర్తి
ఆరు దశాబ్దాల పోరాటం.. అలుపెరగని ఉద్యమం.. వీరుల బలిదానం.. పార్లమెంట్‌లో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన తెలంగాణ రాష్ట్ర అవతరణ బిల్లుకు ఆమోదించడంతో దేశంలో 29వ నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఫలించగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మండల వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీనివాస్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కిషన్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండీ నాయిమ్, రాజీవ్ గాంధీ సెంటర్ లో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి జాతీయ ప్రధాన ఆవిష్కరించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు.
Spread the love