– ఈనెల 25 నుండి మే 2 వరకు
నవతెలంగాణ – భువనగిరి
నవతెలంగాణ – భువనగిరి
పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 25 నుండి మే 2 వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు రెండు గంటల 30 నుండి 5:30 వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవతరగతి పరీక్షకు 3 పరీక్షా కేంద్రములు మరియు ఇంటర్ మీడియట్ పరీక్షలు 3 పరీక్షా కేంద్రములలో జరుగును. ఈ పరీక్షలలో 460 పదవతరగతి , 732 ఇంటర్ మీడీయట్ పరీక్షలకు విద్యార్ధులు హాజరగుచున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసినామని తెలిపారు. విద్యార్థులు పరీక్షకు 30 నిమిషముల ముందుగా హాజరు కావాలని తెలిపారు.