మయన్మార్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులు.!

Telangana residents trapped in Myanmar!Mahamutharam- చెర నుండి విముక్తి కల్పించాలని మహముత్తారం మండల వాసులు
– ఇండియాకు రప్పించాలని బాధిత కుటుంబాల వినతి.
నవ తెలంగాణ మల్హర్ రావు(మహముత్తారం)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలానికి చెందిన లావుడ్యా విజయ్, అజ్మీరా సంతోష్ లు మయన్మార్ ఆర్మీలో బంధీలుగా ఉన్నారని, వారిని ఇండియాకు రప్పించాలని వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులు విలేకరులతో మాట్లాడారు. మహముత్తరాం మండలం లోని నిమ్మగూడెం, దొబ్బలపాడు గ్రామాలకు చెందిన విజయ్, సంతోష్ లు గత ఏడాది డిసెంబర్ లో బతుకుదెరువు కోసం థాయిలాండ్ లోని మయన్మార్ కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ ఒక నెల తర్వాత కావాలని వారితో సైబర్ క్రైమ్ చేయించి ఆర్మీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. అంతేకాక వారు ఆర్మీ ఆధీనంలో ఉన్నారని, ఆ తర్వాత సమాచారం అందించారని అన్నారు. అలాగే అక్కడ ఆరోగ్యం బాగాలేదని, తిండి లేక పస్తులు వుంటుంన్నామని ఫోన్ ద్వారా తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబాల అవసరాల ఉపాధి కోసం వెళ్లిన ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి స్వగ్రామానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love