నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు -2024 కార్యక్రమాలలో భాగంగా ఎంపిక చేయబడిన అర్హులైన క్రైస్తవ అభ్యర్దులను మరియు సంస్దలను గౌరవించి సత్కరించుటకు నిర్ణయించింది. అందుకొరకు అర్హులైన క్రైస్తవ అభ్యర్దుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి పి యాదయ్య తెలిపారు. సామజిక, సేవా రంగం, విశిష్టమైన వైద్య సేవలు, విద్యా బోధన, సాహిత్యం, కళలు మరియు క్రీడా రంగాలలో (10) సంవత్సరాల పై బడి విశేషమైన సేవలు అందించిన క్రైస్తవులు మరియు వైద్య, విద్య & సామజిక సేవారంగాలలో (30) సంవత్సరాల పైబడి సేవ చేస్తూ ఉన్నటు వంటి క్రైస్తవ సంస్దలు గౌరవ సత్కారం సం. 2024 అందుకోనుటకు అర్హులు. ధరఖాస్తు చేయగోరు అభ్యర్దులు/సంస్దలు తమ నామినేషన్లను నిర్ణీత నమూనాలో నింపి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నెంబర్ ఎఫ్16, సమీకృత జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం, యాదాద్రి భువనగిరి నందు డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5-00 గంటల లోగా తమ దరఖాస్తులు అందజేయవలెనని కోరినారు. నామినేషన్ ఫారములు www.tscmfc.in అంతర్జాలము నందు గాని, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయం, యాదాద్రి భువనగిరి నుండి పొందవచ్చును. ఇతర వివరముల కొరకు 9505640004 నెంబరుకు ఫోన్ చేయవచ్చును.