ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు 

– పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ మనీల 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలో శుక్రవారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనవి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8.30 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు వచ్చారు. దీంతో విద్యార్థుల్లో ఎలాంటి భయాందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు. హుస్నాబాద్ పట్టణంలోని బాలుర ఉన్నత , బాలికల ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లాలగడ్డ లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ లో 853 మంది విద్యార్థులు ఉన్నారు.  విద్యార్థులు పూర్తిస్థాయిలో పదవ తరగతి పరీక్షల రాసేందుకు  హాజరయ్యారు.
హుస్నాబాద్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఎంఈఓ మనీల పర్యవేక్షణ చేశారు. నాలుగు పరీక్ష కేంద్రాలలో విద్యార్థుల హాజరు, ఎలాంటి సమస్య లేకుండా  ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు చేపట్టారు.
Spread the love