నవతెలంగాణ – మల్హర్ రావు:
రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబుకు కాటారం మండల బ్యాట్మేంటన్ క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాటారం మండల కేంద్రంలోని బ్యాట్మెంట్ క్రీడాకారుల విన్నపం మేరకు ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్ట్ కొరకు రూ.1 కోటి నిధులు మంజూరు చేసినందుకు క్రీడాకారులు అందరు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు.నేడు ఆదివారం ఉదయం జరగబోయే ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి క్రీడాకారులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్రీడాకారులు కోరారు.ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులు భాను, గౌరవ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, చీర్ల సమ్మిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆత్మకూరి కుమార్ యాదవ్, డోంగిరి చంద్రయ్య, గడ్డం కొమురయ్య యాదవ్, రాజారామ్,కుమ్మరి అశోక్, లింగమూర్తి, కడారి శేఖర్, గంట దేవదాస్, మరుపాక రాజు, డోంగిరి రవి పాల్గోన్నారు.