నవతెలంగాణ-హైదరాబాద్: హనోయ్ వేదికగా వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ 11వ ప్లీనం సమావేశాలు అట్టహాసంగా గురువారం ప్రారంభమయ్యాయి. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి టూ లామ్ అధ్యక్షతన ఈ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. 15 అంశాలతో కూడిన ఎజెండాపై ఈ విస్తృత సమావేశాల్లో సమలోచనలు చేయనున్నారు. అందులో మొదటగా పరిపాలనా విభాగాలు, రాజకీయంగా సంస్థాగత పునర్ నిర్మాణాలపై, స్థానిక పరిపాలనల పునర్వ్యవస్థీకరణ ప్రధానంగా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న 14వ జాతీయ పార్టీ మహాసభలకు సన్నాహాలు, 2026–2031 పదవీకాలానికి అన్ని స్థాయిలలో16వ జాతీయ అసెంబ్లీ, పీపుల్స్ కౌన్సిల్‌లు జరగనున్న ఎన్నికలపై చర్చించనున్నారు.
తన పరిధిలోని సంస్థాగత నియమకాలపై, పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిట్ బ్యూరో.. తన నివేదికను కేంద్ర కమిటీకి సమర్పించనుంది. అదే విధంగా ప్రస్తుత వర్తమాన అంశాలతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై, సైన్స్ టెక్నాలజీ అభివృద్ధిలపై చర్చించనున్నారు. ఈనెల 12 వరకు ప్లీనం సమావేశాలు జరగనున్నాయి.