
మండలంలోని కృష్ణ నగర్ లో పశువైద్య, పశు సంవార్డక శాఖ సంచాలకులు డా. రోహిత్ రెడ్డి, సహాయ సంచాలకులు డా॥ గంగాధరయ్య ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం బుదవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పడి పశువుల పెంపకం దారులకు తమ పశువులకు తప్పకుండా గాలి కుంటూ వ్యాధి నివారణ టికలను వినియోగించుకోవాలని తెలిపారు. పశువుల పెంపకం దారులకు పలు సూచనలు ఇచ్చారు. గాలి కుంటు వ్యాధి సోకిన పశువులకు విపరీతమైన జ్వరంతోవడపడుతుంటాయని, నోటి నుంచి చొంగ కారుతూ, నోటి పుండ్లు, కాళి పుండ్లు గిట్టల మధ్య ఏర్పడుతుందని, నడవలేక ఇబ్బందులకు గురవుతయని, దీని ద్వారా పాల ఉత్పత్తి దగ్గుతుందని తెలిపారు. ఈ గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ నెల 16వ తేది నుంచి మే 15 తేది వరకు మండలంలోని కొనసాగుతాయని, దీనిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యులు కిరణ్ దేశ్ పాండే, ఉమామ సాహెర్, సిబ్బంది విఎల్ఓ వినిత, జెపిఓ కల్యాణి, విఓ అహ్మద్ పాషా, సబార్డినేటాలు, శ్యామల, గంగాధర్, సుహేశ్వరి, పుష్ప, లక్ష్మి, పశువుల యజమానులు పాల్గొన్నారు