హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం నటిస్తున్న హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’.యోగేష్ ఖవీజ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య వ¶వీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథ, చేతిలో గన్ ఉన్నప్పటికీ చట్టాన్ని ముఖ్యంగా భావించే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్‌ల నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను మరింత గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దారు. రిలీజ్ చేసిన తాజా పోస్టర్‌లో సంయుక్త పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తోంది. భారీ ఇండిస్టియల్ మెషీన్ ముందు సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా నిలబడి, చేతిలో గన్‌ను పట్టుకుని కనిపించడం ద్వారా ఆమె పాత్రలోని అగ్రెషన్‌ని ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు. మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తిచేయడం విశేషం. ఐదు పవర్‌ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగింది. మేకింగ్ వీడియోలో ఈ ఎఫర్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అరుదుగా కనిపించే స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. ఈ చిత్రీకరణ కోసం ప్రతిరోజూ రెండు కెమెరాలను ఉపయోగించారు, కొన్ని సందర్భాల్లో అయితే ఐదు కెమెరాలను ఏకకాలంలో వినియోగించారు.అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ‘బ్లాక్ గోల్డ్’ చిత్రం, సినిమా ప్రేమికులను, నేటి తరం జెన్‌జీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు అని చిత్ర యూనిట్ తెలిపింది.తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాన్-ఇండియన్ సినిమాగా విడుదల కానుంది. మురళీ శర్మ, రావు రమేష్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, కష్ణ చైతన్య, చంద్రిక రవి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సహ నిర్మాత: సింధు మాగంటి, డీవోపీ; ఎ వసంత్, సంగీతం: సామ్ సిఎస్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్.



