
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ. డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలో బహార్ పేట్ 26వ వాడు సింగన్నగూడెం 9 వ వార్డులో ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా
మధ్యతరగతి ప్రజలపై గ్యాస్ రూ 50 రూపాయలు పెంచడం నిత్యవసర వస్తువుల ధరలపై పన్నులు వేస్తూ వ్యాపారాలు ధరలు పెంచడం పెనుబారం పడుతుందన్నారు. పనులు లేక ఓ పక్క ఇబ్బంది పడుతుంటే ఒకటి తర్వాత ఒకటి ధరలు పెంచుతూ సామాన్య లపై తడిసి మోపెడవుతుందన్నారు. కార్పొరేట్లకు వాళ్లకు మాఫీ చేస్తూ ప్రజలకు మాత్రం ధరలపై ధరలు పెంచి పేద ప్రజలను నడ్డి విడుస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్నికల ముందు ధరలు తగ్గించి గద్దె ఎక్కిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రజల ను మోసం చేయడమే తక్షణమే ఉపసహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బహర్ పేట శాఖ కార్యదర్శి దండు గిరి సీనియర్ చింతల సత్యనారాయణ, మన్నె రాజు, మన్నె లలిత, లక్ష్మీ రాణి, జంగమ్మ, మంగ, విజయలక్ష్మి పాల్గొన్నారు.