
మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ గతంలో యాక్సిడెంట్ కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది. మరోసారి యాక్సిడెంట్ కావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న తరువాత ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు ట్రైన్ యాక్సిడెంట్ లో మరణించాడు. అతనికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఒక లక్ష7000 రూపాయల చెక్కును వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుమోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, నాయకులు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.