జూన్ 2న జాతీయ పథకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా  జూన్ 2 ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్బంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ సందేశం ఉంటుంది.అంతకుముందు  ఉదయం 8 గంటల 45 నిమిషాలకు జిల్లా కలెక్టర్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Spread the love