కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలి

నవతెలంగాణ- తిరుమలగిరి: ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి 12 వ వార్డు లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ చేయి గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు బూత్ ఇన్చార్జి కొత్తగట్టు రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత  ప్రయాణం, రైతు భరోసా  పథకం  కింద రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, వరి పంటకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తూ అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలరూపాయలు ఉద్యమకారులకు 250చ.గ. ఇంటి స్థలం,  యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, చేయూత పథకం కింద 4000 రూ. నెలవారి పెన్షన్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఆడపడుచులకు వివాహ సమయంలో లక్ష రూపాయల ఇందిరమ్మ కానుక మరియు 10 గ్రాముల బంగారం లాంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని నవంబర్ 30న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలు చేయి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి సతీష్ రెడ్డి, రహమాన్ అలీ, కోరట్ల రాజు, ఏంగోజు మహేంద్ర చారి, మహేష్  తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love