Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి

గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి

- Advertisement -

డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి 
నవతెలంగాణ-నవాబు పేట
అభివృద్ధి పథంలో పల్లెలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందనిడీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పోమాల గ్రామంలో ఐదు లక్షల రూపాయల తో అంతర్గత డ్రైనేజీ కాలువలు, పుట్టోనిపల్లి తాండా, కొత్తకుంట తాండా ల మధ్య 80 లక్షల రూపాయలతో, బీటీ పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. దీంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖు స్థాపన చేసారు యన్మంగండ్ల గ్రామంలో ప్రత్యేక ఓటర్ల సవరణ లో భాగంగా ఎన్యుమరేషన్ విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూ గ్రామాలలో ఉండే సమస్యల పరిష్కారానికి ఎన్నో రకాల నిధులు విడుదల చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, డీసీసీ ప్రధాన కార్యదర్శి నవాజ్ రెడ్డి, నాయకులు వాసు యాదవ్, భూపాల్ రెడ్డి, కోట్ల రాజేష్, హమీద్ మహెక్, తాణెం రాజు, నర్సింహులు, నీలకంఠ, నాయకులు కొల్లి నర్సింహులు, చిర్ప సత్యం, కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -