
రైతుకు రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు మద్దతు ధర సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ రైతుల అభివృద్ధి గురించి మాట్లాడారు. రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిని వ్యవసాయ రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించడం రైతుకు రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్ ఆ మండల ఏవో శివ ఏ ఈ ఓ విశాల్, మాజీ ఎంపిటిసి హనుమంత్ పటేల్, ఉపసర్పంచ్ గ్రామ పెద్దలు సంగ్రామ్ పటేల్, మల్కొండ సుధాకర్ గౌడ్, మోయిన్ సాయి, గొండ సంతోష్, మధు పటేల్, తదితరులతో పాటు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.