
స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఫలాలు అందరికీ అందడం లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.దేశ పౌరులకు సమాన హక్కులు,స్వేచ్ఛను ప్రసాదిస్తున్న భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.సోమవారం డాక్టర్ బీఆర్ 134 వ జయంతి సందర్భంగా అక్బర్ పేట భూంపల్లి మండలం నగరం లో,దుబ్బాక పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.అంబేద్కర్ స్ఫూర్తితో విజ్ఞానం వైపు అడుగులు వేయాలన్నారు.
వాల్ పోస్టర్ ఆవిష్కరణ..
ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను దుబ్బాక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ పీ.కమలాకర్ తో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్,బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి,బీఆర్ఎస్ అక్బర్ పేట భూంపల్లి మండలాధ్యక్షులు జీడిపల్లి రవి,అంబేద్కర్ సంఘం నాయకులు కాల్వ లింగం,చెక్కపల్లి రాజమల్లు,రమేష్,కిషన్,సురేష్, పలువురు పాల్గొన్నారు.