
– 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేద్దాం
సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కోస్ట చట్టం 2023 సవరణలు ఉపసంహరించుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలను ప్రతిఘటిద్దామని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ బందును జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నందిపేట్ మండలంలో టెలిఫోన్, దేశాయి శివాజీ బీడీ ప్యాకర్లు చాటన్ బట్టి కార్మికులతో సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్..కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నది. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్ముతున్నది. కార్మికవర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు కట్టుబానిసలుగా మార్చింది. సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కులను రద్దు చేసింది. లాకౌట్లు, లే-ఆఫ్లు, వేతనాల తగ్గింపు, కార్మికుల తొలగింపులు, కార్మికుల ఉపాధి యజమానుల ఇష్టంపై ఆధారపడే దుర్మార్గపు విధానాలను లేబర్ కోట్లలో పెట్టారు. అంతేకాదు బీడీ వెల్ఫేర్ యాక్ట్ రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం 1 శాతం నిధులు లేకుండా చేసింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోస్టా చట్టం- 2023ని సవరణలు తెచ్చి బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టింది. బీజేపీ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూసుకోవాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో బీడీ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో బీడీ యూనియన్ జిల్లా నాయకులు జమీల్ హైమాద్ దేవిదాస్ ఎస్డి పాషా సాగర్ దత్తాద్రి భూమయ్య నరసయ్య, నవీన్, మహబూబ్ పాల్గొన్నారు.