నవతెలంగాణ- యాదగిరిగట్ట రూరల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే కరెంట్ కష్టాలు తిరినయి, నాణ్యమైన కరెంట్ అందుతుంది అని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం, మండలంలోని వంగపల్లి, చోల్లేరు, మర్రిగుడ, కాచారం, ధర్మారెడ్డి గూడెం, కంటంగూడెం గ్రామాలలో బీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తరుపున గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీరాయని, ఇంటిటికి నల్ల వేసి మిషన్ భగీరథ పథకంతో గ్రామాలలో మంచినీళ్ల కష్టాలు తీరాయి అన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రైతుల కోసం గ్రామాలలో చెరువులను భాగుచేయించి ఎండాకాలంలో నిండుకుండలా మార్చిన ఘనత మన కేసిఆర్ కే సాధ్యం అయింది అన్నారు. రైతు బందుతో రైతులకు పెట్టుబడి, రైతు బీమా పథకంతో రైతులకు భీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. భూమి లేని వారికి రైతు భీమా రూపంలో కేసిఆర్ భీమా తీసుకు వస్తుండు అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో వదువుకు పెద్ద మేనమామ గా లక్ష నుటపదహర్లు ఇస్తుండు, వృద్దులకు పెన్షన్ విడుదల వారిగా పెంచి 5016 చేస్తా అంటున్నాడు, సౌబాగ్యలక్ష్మి పథకంతో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అంటున్నాడు అని అన్నారు. సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ మాట్లాడతూ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే మంత్రి పదవి వస్తది, నియోజకవర్గంను మరింత అభవృద్ధి చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోటకురి అనురాధ బీరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచ్ తొటకురి బీరయ్య, మండల పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కవిడే మహేందర్, ఆలేరు యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గార్లపాటి మహేందర్, ఆలేరు యువజన విభాగం సెక్రటరీ జనరల్ బీబీనగరం లక్ష్మయ్య, కాచారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్, సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి, ఆరే స్వరూప మల్లేష్ గౌడ్, కట్ట విశ్వేశ్వర్ రెడ్డి, మొగిలిపాక రమేష్, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.