Sunday, May 24, 2026
E-PAPER
Homeసినిమాఆద్యంతం అలరించే 'సందిగ్ధం

ఆద్యంతం అలరించే ‘సందిగ్ధం

- Advertisement -

తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ‘సందిగ్ధం’ సినిమా తెరకెక్కింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి మెయిన్ లీడ్స్‌లో నటించగా, విలన్ రోల్ లో తెర చేప ఫేమ్ నవీన్ సంకరపు నటించారు. ఈ మూవీని ఈనెల 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు పార్ధసారథి మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రయాణంలో నా భార్య సంధ్య ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా కలిసి సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ఇంత బాగా తీయగలిగాం. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని తెలిపారు. ‘ఈ సినిమా చిత్రీకరణలో నాకు దర్శక, నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. వారిద్దరూ ఎన్నో కష్టాలను దాటుకుని మూవీని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది` అని నిహాల్ చెప్పారు.కాజల్ తివారి మాట్లాడుతూ,’నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూడండి’ అని అన్నారు.ఈ సినిమాకి నిర్మాత : సంధ్య తిరువీధుల, దర్శకుడు : పార్థసారధి కొమ్మోజు, సంగీతం : గౌతమ్ రవిరామ్, కెమెరామెన్ : నందన్ కృష్ణ, ఎడిటర్ : విశ్వన్ రాజ్. డిఎస్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -