భూమి అడుగుతోంది?నా పిల్లలు ఎక్కడని
పుడమిపై పురుడు పోసుకున్న
జీవకోటికి అవసరాలు తీర్చింది
జలచర జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది
ధరణిలోనుంచి పుట్టుకొచ్చిన
మొక్కను చూసి మురిసిపోయింది
భవిష్యత్తు సమాజ మేలు కోరింది
ఆకాశం నుంచి జాలువారిన
వర్షపు నీరును ఒడిసి పట్టుకుంది
సకల జీవరాశికి నీరందించి దాహార్తిని తీర్చింది
భూ మండలం కలుషితం
అవుతున్న వ్యర్థాలను స్వీకరించింది
మంచి ఫలాలను అందించింది
ప్రకృతితో ముడివేసిన బంధంలా
చెట్ల బలగాన్ని చూసి మురిసిపోయింది
అంతరించిపోతున్న అడవులను
పశుపక్షాదులను,నరికేస్తున్న వృక్షాలను చూసి
బోరున విలపిస్తోంది. నా పిల్లలెక్కడా, అని
భూమి అడుగుతోంది?
-మిద్దె సురేష్,
9701209355