మోడీ పదేండ్ల పాలనలో దేశం పతనం 

– ఈనెల 22న మునుగోడు నియోజకవర్గం లో  చండూరు,మునుగోడు, గట్టుప్పల్  జరిగే అభ్యర్థి పర్యటనను జయప్రదం చేయండి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి..
 నవతెలంగాణ  – చండూరు  
 ప్రజలకు నష్టం చేస్తున్న నరేంద్ర మోడీ  పదేళ్ల పాలనలో దేశం పూర్తిగా పతనమైందని  సిపిఐ(ఎం ) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ    సమావేశంలో  ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో  అధికారంలోకి వచ్చేందుకు బూజో పార్టీలు ప్రజలకు డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ప్రశ్నించే  గొంతుగా ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండా పాలన కోసం  ప్రజలు ఎదురుచూస్తున్నారు  అన్నారు. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి జహంగీర్ నామినేషన్ ర్యాలీతోనే సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఎర్రజెండ చరిత్రను పునరావృతం చేయడానికి కార్మికులు కర్షకులు నడుం బిగించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజెండా కు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఎర్రజెండా చేసిన పోరాటాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రైతంగ సాహిత పోరాటంలో కమ్యూనిస్టులు వీరవచిత పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టులు ప్రాణాలను అర్పించారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించి , గెలిచిన వ్యక్తి రావి నారాయణరెడ్డి అని అన్నారు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం లో కమ్యూనిస్టుల పాత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ ఒక ఎర్రజెండానే అని అన్నారు. ఈనెల 22న మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, బోడంగిపర్తి, తస్కని గూడెం, చండూరు, అంగడిపేట, బంగారిగడ్డ, ధోని పాముల, నెర్మట, కొండాపురం, తెరటుపల్లి, గట్టుప్పల, వెల్మ కన్నె, కొంపెల్లి, కల్వకుంట్ల గ్రామాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం,కర్నాటి సుధాకర్,ఖమ్మం రాములు, కక్కునూరి నగేష్, ఎండి రబ్బాని, లక్ష్మయ్య,నరసింహ, రాములు, కర్నాటి వెంకటేశం కైలాసం, యాదయ్య, ఖమ్మం యాదయ్య, నల్లవెల్లి బిక్షం, మొద్దు గాలయ్య దుబ్బాక రాములు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love