నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించే రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ కోరారు.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం వద్ద రైతు పండుగ బ్యానర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారిని రమ్యశ్రీ మాట్లాడుతూ రైతు పండుగ వేడుకల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా, అమిస్తాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే రైతు పండుగ మహాసభను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదిక భవనంలో రైతులు వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రమేష్, కావ్య, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.