వడ్లును కొనేవారు లేక దీనస్థితిలో మంచిప్ప గ్రామ రైతులు పరిస్థితి

నవతెలంగాణ – మోపాల్
మోపాల మండలంలోని మంచిప్ప గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది వడ్లు కొనేవారు లేరని రోజులు గడుస్తున్న సొసైటీ నుండి సరైన సమాధానం లేక ఇబ్బంది పడుతున్నామని, తమ గ్రామంలో కొనుగోలు  కేంద్రం లో వడ్లు కొనడం నత్తనడకన నడుస్తుందని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాటల్లో కాదు చేతల్లో చూయించి రైతులకు రైతు భరోసా కాదు ముందు వడ్లను కొనే విధంగా చూడాలని ఆయన వేడుకున్నారు. ఒకవేళ మా గ్రామంలో వడ్లుకొనే పరిస్థితి లేకుంటే గ్రామం రైతులందరం కలిసి ధర్నా చేపడతామని, మా బాధని చూడలేక చదువుకునే మా ఇంట్లో ఉండే చిన్న చిన్న ఆడ పిల్లలు సైతం రోజు పొద్దు నుండి సాయంత్రం దాకా వడ్లకు కాపలా కాస్తున్నానని ఎప్పుడు వర్షం పడుతుందో ఇక్కడ వడ్లు నానిపోతాయని రాత్రి సమయంలో సరైన నిద్ర లేక పట్టాలు కప్పుదామంటే గాలికి ఎగిరిపోతూ అగమ్య గోచరంగా ఉందని మా పరిస్థితి, మాకు జీవనాధారమే వ్యవసాయమని, దాదాపు పొలాలు కోసి 20 రోజులు గడుస్తున్నా కూడా మా మా మంచిప్ప గ్రామంలో వడ్లను తీసుకునే వారి కరువయ్యారని వాపోయారు. ఒక దిక్కు ముంపు గ్రామం గా బాధపడుతుంటే మరో దిక్కు వ్యవసాయ రoగం పైన కూడా మాకు ఇబ్బంది గురి చేస్తున్నారని సొసైటీ వారు సైతం తమ గ్రామం పై చిన్న చూపు చూస్తున్నారని అక్కడ రైతులు వాపోయారనీ మంచిప్ప మాజీ ఉపసర్పంచ్ జగదీష్ మరియు రైతులు తెలిపారు.

Spread the love