బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందుకున్న బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ – మోపాల్
గురువారం రోజున హైదరాబాదులో తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బీఫామ్ అందుకోవడం జరిగింది. ఎలక్షన్ ఖర్చు నిమిత్తం రూ.90 లక్షల రూపాయలు విలువ గల చెక్కును కూడా అందించడం. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విజీ గౌడ్, జెడ్పి చైర్మన్ దాదన్న, విట్టల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love