మృతుడు పూజారి కుటుంబాన్ని పరామర్శించిన గ్రంథాలయ మాజీ చైర్మన్

The former chairman of the library visited the deceased priest's familyనవతెలంగాణ – తాడ్వాయి 

ఇటీవల మృతి చెందిన మేడారం సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య కుటుంబాన్ని ఆదివారం ములుగు జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద నాయక్, మండల అధ్యక్షుడు దండగల మల్లయ్య తో కలిసి సందర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. మల్లెల ముత్తయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

Spread the love