వి’చిత్రాలు’

సంక్రాంతి పండుకు కొత్త అల్లుళ్లు వచ్చినట్టే కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ సందర్భంగా విడుదలైన చిత్రాలపై భారీ అంచనాలు ఉంటాయి. కలెక్షన్ల వర్షం కురు స్తుందనే విశ్వాసం. ప్రేక్షకులు ఈ పండుగను థియెటర్లలో జరుపుకుంటారనేంతగా ప్రచారమవుతున్నది. కానీ కొన్ని చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తు న్నాయి. ఒక్కొక్కసారి చిన్నచిత్రాల దెబ్బకు భారీ బడ్జెట్‌ చిత్రాలు గిలగిల కొట్టుకుం టాయి. ఒక్కొక్కసారి పెద్ద హీరోల చిత్రాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందు బలాదూరే. ప్రేక్షకుల అభిరుచికి తగ్గినట్టుగా ఉంటేనే, ఆ సినిమా హిట్‌ అవు తుంది. లేకపోతే ఫట్టే. సంక్రాంతి పండుగకు సినిమా విడుదలైతే అది అఖండ విజయం సాధి స్తుందనే విశ్వాసం బలంగా ఉన్నది. కొంతమంది దర్శకులకు, హీరోలకు, నిర్మా తలు కూడా అదే భావిస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్‌, మహేష్‌బాబు కామినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం చిత్రం సప్పగా ఉందనే టాక్‌. కొత్త హీరో, చిన్న సైజ్‌ బడ్జెట్‌… వెరసీ హనుమాన్‌ చిత్రం దూసుకుపోతున్నది. బండ్లు ఓడలౌతాయి. ఓడలు బండ్లు అవుతాయి అనే నానుడి. సినిమాలకు కరెక్టుగా సరిపోతాయి. పెద్దగా ఉహిస్తే ఢమాల్‌ మంటున్నాయి. ఏదోలే అనుకున్న సినిమాలు కూడా పెద్ద హిట్‌ ఇస్తున్నాయి. ఇటీవల బలగం సినిమా చిత్ర పరిశ్రమలకు పెద్ద సవాల్‌ విసిరింది. గతంలో శతమానం భవతి చిత్రం కూడా పెద్ద చిత్రాలను షేక్‌ చేసింది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన జైలర్‌, మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్‌ ఒకే సమయంలో విడుదలయ్యాయి. జైలర్‌ దెబ్బకు బోళాశంకర్‌ పరార్‌ అయ్యాడు. బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి ఊర్రూతలూగించింది. మిగతా సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. అదే సినిమాల్లో జరిగే చిత్ర, వి’చిత్రం’
– గుడిగ రఘు

Spread the love