గ్రామీణ ప్రాంతంలో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యం

నవతెలంగాణ – నెల్లికుదురు 
గ్రామీణ పోషకాహార లోపాన్ని నివరించడమే లక్ష్యంగా. అంగన్వాడి సెంటర్ల ద్వారా అందించే  పోషక ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని సి డి పి ఓ కమల ఏ సి డి పి ఓ లు, విజయలక్ష్మి, ఇందిరా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ నాగమణి, విజయ అన్నారు. మండలంలోని నెల్లికుదురు సెక్టర్ లోని మునిగలవీడు గ్రామంలో, ఎర్రబెల్లి గూడెం సెక్టర్, లలో పోషణ పక్షంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నెల్లికుదురు సెక్టర్ లోని మునిగల వీడు గ్రామంలో నిర్వహించామని అదేవిధంగా ఎర్రబెల్లి కూడా సెక్టార్ లోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో పోషక పక్వాడ కార్యక్రమం పై గర్భిణీ స్త్రీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు పోషకాహార లోపంతో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని ఉద్దేశంతో ఈ పథకం ద్వారా అందిస్తున్నామని అన్నారు గ్రామాలలో బాలబాలికలకు గర్భవతులకు బాలింతలకు పోషకాహార పేదవారి పిల్లలకు పేద మహిళలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందించడం జరుగుతుందని అన్నారు అంగన్వాడి కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ గ్రామాలలో పోషకాహార లోపంతో ఏ పిల్లలు కనిపించకూడదని ఉద్దేశంతో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తల్లి పిల్లలకు పోషక ఆహార విలువలను  పిల్లల తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు  సూచించారు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు గుడ్లు లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఇంటి పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ ఇందిరమ్మ, విజయలక్ష్మి, సూపర్వైజర్ నాగమణి, విజయ, అంగన్వాడి టీచర్లు  అలివేలు, సుభోధర, స్వరూప, వెంకటమ్మ బి వీరలక్ష్మి బి వెంకటమ్మ ఎస్కే జమ్మాల్ బి మహతి సరోజినీ ఆయాలు సుగుణ లక్ష్మీ దనమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love