తండ్రి గుండెల మీద తనయుడి గెలుచిన గోల్డ్ మెడల్

– మృతుదేహం పై సాధించిన గోల్డ్ మెడల్ పెట్టీ కొడుకు రోదన 
నవతెలంగాణ -కొనరావుపేట
గుండెపోటుతో మరణించిన తండ్రి గుండెల మీద…తనయుడు గెలిచిన గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ పెడుతూ రోధించిన హృదయకారట సంఘటన  కోనరావుపేట మండలంలో జరిగింది. మండలంలోని వట్టిమల్ల గ్రామంలో బుదవారం రాత్రి  అనుముల రాజేశం అనే లారీ డ్రైవర్ వృత్తిలో భాగంగా భద్రాచలం కిరాయి వెళ్లి వచ్చి భోజనం చేసి పడుకొని నిద్రలో గుండెపోటు వచ్చి మరణించాడు. ఆ తండ్రి మరణ వార్త తెలుసుకున్న తనయుడు పవన్ హైదరాబాద్ నుండి నేరుగా స్వగ్రామానికి చేరుకొని, తండ్రి గుండెల మీద వాలి బోరున విలపిస్తూ, తను రన్నింగ్ లో గెలుచుకున్న గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ త్రండి గుండెల మీద పెట్టి చూడు నాన్న అని అంటూ బోరున విలపించాడు. పవన్ రోదిస్తున్న తీరు గ్రామస్తులందరి హృదయాలను కలిచివేసింది. కాగా మృతుడు రాజేశంది చిన్నతనం నుండే నిరుపేద కుటుంబం కావడంతో  కుటుంబ భారం అంతా తన భుజాల మీద వేసుకొని డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తు, కష్టపడి కుమారుడిని చదివిస్తున్నాడు కుమారుడు పవన్ చిన్నప్పటినుండి చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చి టాపర్ గా నిలవడంతో హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఫ్రీ సిట్ రావడంతో , రానున్న రోజుల్లో తమ కష్టాలు అన్ని తీరతాయని కుటుంబం అంత సంతోషంగా ఉన్న సమయంలో రాజేశం మృతితో కుటుంబం దిక్కుతోచని స్థితోలో రొడ్డుపడేసింది. మొదటి నుండి టాపర్గర్ నిలిచిన పవన్ ప్రస్తుతం పదోవతరగతి లో స్పోర్ట్స్ లో 400 మిటర్ సీనియర్ రన్నింగ్ లో నాలుగు రౌడ్స్ గెలిచి, ఉత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ సంతోషం ఎంతో సేపు లేదు తండ్రి మరణ వార్త వినగానే హఠాత్తుగా స్వగ్రామం చేరిన పవన్ తను గెలిచిన గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ను తన తండ్రి గుండెల మీద పెడుతూ చూడు నాన్న అని అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్న పవన్ చూసి అందరికీ హృదయాలను కలిసి వేసింది.
Spread the love