– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట
మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయా లను కల్పిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట, చందాపూర్ గ్రామాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మహిళా సమైక్య భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళల సాధికారతే లక్ష్యంగా, అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్తు మహి ళలదేనని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం వెంకట్రావుపేట నిమ్మతోటలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తూ ఆకర్ష ణీయంగా తీర్చిదిద్దిన అంగన్‌వాడీ టీచర్ వీణను అభినందించి శాలువాతో సన్మానించారు.
అలాగే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ అభిమాని బొగ్గుల పోచమ్మను ఆప్యాయంగా పలకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్బంగా ఎమ్మెల్యే గారిని, బక్కి వెంకటయ్య లను సర్పంచ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కే. హరికృ ష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి సర్పంచ్ లు బండారు కవిత స్వామి గౌడ్, చంద లావణ్య స్వామి, బక్క కనకయ్య, ప్రవీణ్ రెడ్డి, రాజిరెడ్డి, కోల వెంకటస్వామి గౌడ్, ఐకేపీ ఏపీఎం బాబురావు, ఉపసర్పంచ్‌లు లచోళ్ల లింగం, ఆత్మకూరి శ్రీకాంత్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు చిలువెరి మల్లారెడ్డి, వేల్పుల స్వామి, మల్లేశంలతో పాటు మహిళా సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



