విద్యుత్ శాఖను అప్పుల ఉభిలోకి నెట్టిన భారసా ప్రభుత్వం 

– అసెంబ్లీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ .
నవతెలంగాణ -అచ్చంపేట:  విద్యుత్ శాఖ ను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత బి.ఆర్.ఎస్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దక్కిందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అసెంబ్లీ సాక్షిగా సమావేశంలో వెల్లడించారు. నియోజవర్గం పరిధిలోని దోమలపట సమీపంలో జరిగిన జెన్కో విద్యుత్తు సంఘటనలో 9 మంది గత ప్రభుత్వా నిర్లక్ష్యంతో అక్కడే సజీవ దహనమైన సంఘటనపై ఎమ్మెల్యే అసెంబ్లీలో మనోవేదనకు గురయ్యారు. సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. విద్యుత్తు సంస్థల డిస్క్ లలో విషయంలో అవినీతి అవినీతి జరిగిందని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వ నివేదికలు ఇవ్వడానికి అధికారులు జంకుతున్నారు. ఆరోపించారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న విద్యుత్ సమస్యల పైన అసెంబ్లీలో గళం విప్పి అలాగే ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలులోకి తీసుకొస్తామన్నారు.
Spread the love