పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి…

– ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ.  
నవతెలంగాణ – భువనగిరి                      
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లీ అనురాధ మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజువారి వంట అవసరాలకు గ్యాస్ పై ఆధార పడుతుందని ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 400  ఉన్న గ్యాస్ ధరలను దాదాపు  రూ. 1100  వరకు పెంచి ఎన్నికల సమయంలోరూ.100  తగ్గించి మళ్లీ ఇప్పుడు  50 రూపాయలు పెంచడం సరికాదని అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాల కు పాల్పడుతూ నిత్యవసర ధరలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిరుపేదలపై రోజురోజుకీ భారాలు మోపుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. పెంచిన నిత్యవసర ధరలు పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను తగ్గించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి ,పట్టణ నాయకులు గౌటి మంగమ్మ, సైదమ్మ ,కడబోయిన లక్ష్మీబాయి, బండారు లక్ష్మి, బొమ్మారం యశోద, బట్టు కృష్ణవేణి, షమీం, రేష్మ బేగం, ఆస్వియ, మైలారం మంజుల, సమీరా  పాల్గొన్నారు.
Spread the love