అనధికారిక రేషన్ లైజేషన్ ప్రక్రియను ఆపాలి

– ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన 
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
రాత్రికి రాత్రి ఎస్జీటీ పోస్టులను తగ్గిస్తూ జిల్లాలో చేసినటువంటి రేషన్ లైజేషన్ కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీఆర్టీయూ, తపస్, టీయూటీఎఫ్, బీసీటీయూ, టీఆర్ టీఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తెలియకుండా అనధికారికంగా అధికారుల స్థాయిలో నిర్వహిస్తున్న రేషన్లైజేషన్ ప్రక్రియను వెంటనే ఆపాలని, అదేవిధంగా ఎస్జీటీలకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ టైమింగ్స్ ను కూడా పొడిగించాలని, ఆ మేరకు ప్రభుత్వం వెంటనే కల్పించుకొని ఎస్జీటీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  దుడుకు లక్ష్మీనారాయణ, టీపీయూ ఎస్ జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరాం,టి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, బీసీ టీయూ జిల్లా అధ్యక్షులు కొన్ని శంకర్ గౌడ్, టీపీ ఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు  భాస్కర్ గౌడ్, టీఆర్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబా యాదవ్, పీఆర్ టీయూ శ్రీనివాస్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love