ఈనెల 12న జన్నారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న మహానియుల జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం ఖానాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బుక్య జాన్సన్ నాయక్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు రావాలని జాన్సన్ నాయకులు నేతకాని మహార్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ, ఈ మహానీయుల ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ, కులమతాలకు అతీతంగా అందరూ అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలన్నారు. ఏప్రిల్ నెలలో భారతదేశ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహనీయుల జయంతి వేడుకలు ఉండడం, వారందరి జయంతులను ఒకే వేదిక మీదిగా నిర్వహిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు జాడి గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఒల్లాల నర్సా గౌడ్, జంగం సంతోష్, నేతకాని కుల సంఘం రాష్ట్ర నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, ఎస్ సి టి సంస్థ సభ్యులు మంతెన వెంకటేష్, పొండేటి సతీష్, అల్లూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.