డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారిపై వస్తున్న ఆరోపణల పై విచారణ చేపట్టాలి  

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఐద్వా సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..అక్రమాలకు పాల్పడితే మహిళా ఉద్యోగులపై లైంగిక వే ధింపుల పాల్పడుతున్న అధికారి పై వచ్చిన ఆరోపణలకు విచారణ చేపట్టిన కూడా నామమాత్రంగా విచారణలు చేస్తూ కేసుని పక్క తోవ పట్టిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే మహిళ ఉద్యోగుల కోసం ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాము అని ఐత్వ జిల్లా కార్యదర్శి బి సుజాత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love