ఓరుగల్లు రాజసానికి ప్రతీక కాకతీయ తోరణం

నవతెలంగాణ – చండూరు: ఓరుగల్లు రాజసానికి ప్రతీక కాకతీయ కళాతోరణం అని ఘన చరిత్ర కలిగిన కాకతీయ తోరణాన్ని రాష్ట్ర రాజముద్ర నుండి తొలగించడం అనైతికమని బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాపాక ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజముద్రను అందులో ముఖ్యంగా కాకతీయ కళాతోరణాన్ని తొలగించి కొత్త ముద్రను విడుదల చేయాలని చూస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కాకతీయ తోరణం అని వ్యాఖ్యానించారు. ప్రజా, విద్యార్థుల, నిరుద్యోగుల, రైతుల సమస్యలను పరిష్కరించడం మరిచి తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ కళాతోరణం తొలగించాలని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కుట్రను మానుకోవాలని హితబోధ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన రాజముద్రను ప్రవేశపెట్టడం ఆపివేయాలి లేదంటే ప్రజాగ్రహంకి గురి కావడం జరుగుతుందని తెలిపారు. కాకతీయుల కళ తోరణంలో సాంస్కృతిక కళా సంపద, ప్రాచీన ఆధ్యాత్మికత పొందుపరిచి ఉందన్నారు. కాకతీయుల పాలనలో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా, జలకళ, శిల్పకళ, నృత్యకళ, పాడి పంటలు, పశుసంపద, పచ్చని మాగాణి కళా రంగాలకు పుట్టినీళ్లుగా విరజిల్లిందని వివరించారు. రాష్ట్ర రాజ్యముద్రను మార్చే ప్రయత్నాన్ని ప్రభుత్వ మానుకోవాలని అన్నారు.

Spread the love