Tuesday, April 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలు700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి

700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ-భువనగిరి: 700 సర్వే నెంబర్ భూమిని చదును చేసి ప్రజలకు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోర్టు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ సిపిఎం పోరుబాట సందర్భంగా పట్టణంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమస్యలు అదేవిధంగా మౌలిక సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సమస్యలపై అధ్యయనం చేయడం జరిగిందన్నారు. ఈ వస్తున్న పరిష్కారాన్ని కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టణంలోని 700 సర్వే నెంబర్లు పట్టాలి ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న అనేకమంది పేదలు ఇండ్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారన్నారు. చాలీచాలని ఇంటిలో సమస్యలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలకు ముందు అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని వెంటనే అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పెన్షన్లు లేకపోవడం వలన వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే అర్హత కలిగిన పేదలందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పట్టణంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. పట్టణంలోని 35 వార్డులలో అండర్ డ్రైనేజీ సీసీ రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందించలేకపోతుందన్నారు. దాని స్థాయిని పెంచడం వలన జిల్లావ్యాప్తంగా ప్రజల వైద్య అవసరాలు తీసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రజల సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజలందరినీ సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కార్యవర్గ సభ్యులు గంధమల మాతయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, పట్టణ నాయకులు బర్ల వెంకటేష్, వల్దాస్ అంజయ్య, చింతల శివ, కొత్త లలిత, ఈర్ల రాహుల్, వెంకటేష్, రియాజ్, తాళ్ల పెళ్లి శివ, మన్నె రాజు, కన్య బోయిన అరుణ, ఇక్కుర్తి కళావతి, సోమయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -