Tuesday, April 28, 2026
E-PAPER
Homeజాతీయంజాదవ్ పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం

జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐసీసీ (ఇటర్నల్ కంప్లైట్స్ కమిటి) ఎన్నికల ఫలితాల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. ఆర్ట్స్ విభాగంలో ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో డిఎస్ఎఫ్ (డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) దాదాపు 1,300 ఓట్ల భారీ మెజారిటీతో, 100 ఓట్ల తేడాతో గెలుపొందింది. సైన్స్ విభాగంలో ‘ది ఇండిపెండెంట్’ (డబ్ల్యూటిఐ) గెలుపొందింది. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం (టిఎంసిపి) ఆర్ట్స్ విభాగంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు, బిజెపి విద్యార్థి విభాగమైన ఎబివిపికి వచ్చిన ఓట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటి ఈ ఫలితాలను సోషల్ మీడియాలో ప్రకటించింది. “విద్యార్థుల తీర్పు స్పష్టంగా ఉంది. వారికి న్యాయమైన, సురక్షితమైన, ప్రజాస్వామిక క్యాంపస్ కావాలి” అని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -